Top 5 Final: బిగ్ బాస్ టాప్ 5 ఫైనల్.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న భరణి
Top 5 Final: శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్‌తో హౌస్ నుంచి బయటకు వెళ్లగా,రెండో ఎలిమినేషన్‌గా భరణి శంకర్ హౌస్‌ను వీడారు.
Top 5 Final
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకునే సరికి ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. 14వ వారం సందర్భంగా హోస్ట్ నాగార్జున ప్రకటించిన డబుల్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లోనే అతిపెద్ద షాక్‌గా మారింది. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్‌తో హౌస్ నుంచి బయటకు వెళ్లగా, రెండో ఎలిమినేషన్ ఎవరు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరపడుతూ, రెండో ఎలిమినేషన్‌గా భరణి శంకర్ హౌస్‌ను వీడారు.
భరణి శంకర్ ఎలిమినేషన్ పూర్తిగా ఊహించని నిర్ణయం కాదు. అయితే, ఆయనకు ఉన్న ఫాలోయింగ్, రీఎంట్రీ నేపథ్యం, టాప్ 5(Top 5 Final)లో ఉంటారనే ప్రచారం కారణంగా ఈ ఎలిమినేషన్ కొందరికి షాకింగ్‌గా మారింది. ముందుగా సంజనా లేదా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని అనుకున్న ఆడియన్స్‌కు ఇది పెద్ద ట్విస్ట్‌గా మారింది.
భరణి శంకర్ ఈ సీజన్‌లో ఇదే మొదటి ఎలిమినేషన్ కాదు. ఆరో వారంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు. అయితే అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు, షో నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రయత్నించి భరణిని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఈ రీఎంట్రీపై అప్పట్లోనే వివాదం చెలరేగింది. ముఖ్యంగా నాగబాబు ఒత్తిడి, పవన్ కళ్యాణ్ రికమండేషన్ వల్లే భరణికి రీఎంట్రీ దక్కిందని దివ్యెల మాధురి చేసిన ఆరోపణలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఫ్యామిలీ వీక్‌లో నాగబాబు హౌస్‌కి రావడం కూడా ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది.
ఇక ఈ మధ్య లీక్ అయిన నాగార్జున, నిహారికల సంభాషణలో కూడా నాగబాబు ఒత్తిడి మేరకే భరణిని హౌస్‌లో కొనసాగించామని, టాప్ 5(Top 5 Final)లో ఉంచాలని చెప్పారని వెల్లడైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, అదే వీడియో కారణంగా, భరణిని టాప్ 5(Top 5 Final)లో ఉంచితే తీవ్ర విమర్శలు వస్తాయని భావించిన నిర్వాహకులు, చివరి నిమిషంలో ఆయనను ఎలిమినేట్ చేసినట్లు టాక్.

రీఎంట్రీ తర్వాత భరణి పెద్దగా తన ఆటను చూపించలేకపోయారని విమర్శలు ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో గొడవలు, అరుపులు తప్ప, గేమ్‌ను లీడ్ చేసే స్థాయిలో ఆయన యాక్టివ్‌గా లేరన్న అభిప్రాయం బలంగా వినిపించింది. అంతేకాదు, ఒరిజినాలిటీ లేదన్న విమర్శలు కూడా ఆయనపై వచ్చాయి. ఇవన్నీ కలిపి చూసుకుంటే, నిర్వాహకులు ఆయనను కొనసాగించకుండా బయటకు పంపారని తెలుస్తోంది.
భరణి శంకర్ ఎలిమినేషన్‌తో పాటు మరో హాట్ టాపిక్‌గా మారింది ఆయన పారితోషికం. బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొనడానికి భరణి భారీ మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. చర్చల తర్వాత రోజుకు రూ. 50,000 చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్వాహకులు ఓకే చెప్పారట. అంటే వారానికి రూ. 3.50 లక్షలు.

మొదటిసారి హౌస్‌లో ఉన్న 6 వారాలకుగానూ ఆయన సుమారు రూ. 21 లక్షలు అందుకున్నారు. ఆరో వారం ఎలిమినేషన్ తర్వాత వచ్చిన వ్యతిరేకత తర్వాత 8వ వారం రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తర్వాత మరో 6 వారాల పాటు గేమ్‌లో కొనసాగిన భరణి, మళ్లీ అదే లెక్కన మరో రూ. 21 లక్షలు అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో భరణి శంకర్ సుమారు రూ. 42 లక్షలు పారితోషికం తీసుకున్నట్టు అంచనా. ఈ లెక్కల ప్రకారం, ఈ సీజన్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్‌గా భరణి శంకర్ నిలిచారని చెప్పవచ్చు.
సుమన్ శెట్టి, భరణి శంకర్ ఎలిమినేషన్‌తో టాప్ 5(Top 5 Final) కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనల్‌కు చేరుకోగా, హౌస్‌లో ఇమ్మాన్యుయెల్, తనూజ, సంజనా, డీమన్ పవన్ ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక స్వాగత ఎపిసోడ్లు నిర్వహించి, వారి జర్నీలను బిగ్‌బాస్ హైలైట్ చేయనుంది. ఇక టైటిల్ పోరు ఈ ఐదుగురి (Top 5 Final)మధ్యే జరగనుంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ సీజన్ విన్నర్‌గా ఇమ్మాన్యుయెల్ పేరు దాదాపు ఫిక్స్ అయ్యిందట. మరి నిజంగానే ఆయన్నే విన్నర్ చేస్తారా? లేక కామన్ మ్యాన్ ఇమేజ్ ఉన్న కళ్యాణ్ పడాల టైటిల్ కొల్లగొడతారా? అనేది గ్రాండ్ ఫినాలేలో తేలాల్సి ఉంది.



