Juice: నిద్ర పట్టట్లేదా? రాత్రి పూట ఈ జ్యూస్ తాగితే హాయిగా నిద్రపోవచ్చు
Juice: రాత్రి పూట నిద్ర పట్టనివారు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Juice
చాలామందికి నిద్రలేమి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, రాత్రి పూట నిద్ర పట్టనివారు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పట్టడానికి సహాయపడే చెర్రీ జ్యూస్ (Juice) బాగా పనిచేస్తుందని అంటున్నారు.
మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి కారణంగా చాలామందికి రాత్రిపూట నిద్ర కరువవుతోంది. ఇలాంటి నిద్రలేమి సమస్యలు ఉన్నవారికి చెర్రీ జ్యూస్ ఒక మంచి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, పడుకునే ముందు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని చెబుతున్నారు.
చెర్రీస్‌లో మెలటోనిన్ (Melatonin) అనే హార్మోన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని సాధారణంగా ‘స్లీప్ హార్మోన్’ అని పిలుస్తారు. మనిషి ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నిర్ణయించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి చెర్రీ జ్యూస్ తాగడం వల్ల శరీరం సహజంగా నిద్రలోకి వెళ్లే ప్రక్రియ మెరుగుపడుతుంది.
చెర్రీ జ్యూస్ (Juice)లో ఉండే ట్రిప్టోఫాన్ (Tryptophan) అనే సమ్మేళనం కూడా నిద్రపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇది మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

చెర్రీ జ్యూస్ సిర్కాడియన్ (Circadian Rhythm) రిథమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరానికి సహజంగా నిద్ర పట్టే సమయాన్ని సరిదిద్దుతుంది.
నిద్రలేమితో బాధపడేవారు పడుకోవడానికి రెండు గంటల ముందు ఒక గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, చెర్రీ జ్యూస్‌తో పాటు మెలటోనిన్ ఉన్న ఇతర ఆహారాలు లేదా సప్లిమెంట్‌లను కూడా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.