Just NationalLatest News

Rajnath Singh: సింధ్ పై రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు.. పాక్ లో వణుకు మొదలు

Rajnath Singh: పాకిస్తాన్‌కు కీలకమైన ఓడ రేవు కరాచీ నగరం.. సింధ్ రాష్ట్రంలోనే ఉంది. అందుకే, రాజ్‌నాథ్ వ్యాఖ్యలు పాక్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Rajnath Singh

సింధ్ రాష్ట్రం మళ్లీ భారత్ లో కలవొచ్చంటూ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు శత్రుదేశం పాకిస్తాన్ లో వణుకు పుట్టిస్తోంది. సింధ్ ను భారత్ నుంచి వేరు చేయడంతో గతంలోనే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తాను రాసిన పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే విషయాన్ని ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేయడం పాక్ రాజకీయ నేతలు, అక్కడి ఉగ్రవాద సంస్థలకు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తోంది.

సరిహద్దులు మారొచ్చన్న రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) వ్యాఖ్యలతో పాక్ లో పలువురు నేతలు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో పాక్ కు జరిగిన నష్టం ఇంకా మరిచిపోలేదు. అందుకే ఈ టెన్షన్ మరింత పెరిగింది. సింధ్ ప్రావిన్స్ విలీనంపై రాజ్‌నాథ్ ఈ రేంజ్ ప్రకటన చేయడానికి కారణం లేకపోలేదు. సింధ్ ప్రజలు దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌పై పోరాడుతున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీవోకే ప్రాంతాలకంటే ముందు నుంచే పాకిస్తాన్‌పై పోరాటం మొదలుపెట్టారు.

1947లో భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడింది. విభజనలో భాగంగా.. గుజరాత్, రాజస్థాన్‌తో సరిహద్దు పంచుకునే సింధ్‌ ప్రాంతం పాకిస్తాన్‌ చేతికి వెళ్లింది. అనంతరం.. సింధ్‌‌లోని హిందువులను ఇస్లాంలోకి మారాలంటూ మతోన్మాద ప్రభుత్వం ఒత్తిడి చేసింది. హిందువులను తీవ్రంగా హింసించింది. సింధ్‌ ప్రాంతంలో పాక్ అరాచకాలను భరించలేక సుమారు 8 లక్షల మంది భారత్‌ వచ్చేశారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, ఇళ్లు, సంపదను వదిలేసి.. మరీ భారత్‌ కు వచ్చేసి తలదాచుకున్నారు. మరికొందరు హిందువులు నేటికీ సింధ్‌లోనే ఉన్నారు. కానీ.. వారి హక్కులు పూర్తిగా అణిచివేయబడ్డాయి. దీంతో ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అవడంతోనే సింధూదేశ్ ఉద్యమం మొదలైంది.

Rajnath Singh
Rajnath Singh

ఇప్పటికే పాకిస్తాన్‌‌లో బలూచిస్తాన్‌, ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా, పీవోకే వంటి కీలక ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో సింధ్ చేజారితే పాక్ కథ ముగిసినట్టే. ఎందుకంటే, పాకిస్తాన్‌లో జనాభా పరంగా రెండో అతి పెద్ద రాష్ట్రంగా సింధ్ ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కూడా ఆ రాష్ట్రమే వెన్నెముక. సింధ్‌లోనే ఆహారం ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది.

పాకిస్తాన్‌కు కీలకమైన ఓడ రేవు కరాచీ నగరం.. సింధ్ రాష్ట్రంలోనే ఉంది. అందుకే, రాజ్‌నాథ్ వ్యాఖ్యలు పాక్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. అది భారత భూభాగం అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ చెప్పేప్రయత్నం చేశారు. తద్వారా సింధ్ ప్రజలకు భారత మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఈ ప్రకటనే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button