Manila Tamarind : ఈ కాయల వల్ల అన్ని లాభాలున్నాయా?
Manila Tamarind : ఒకప్పుడు మన గ్రామాల్లో ఎక్కువగా కనిపించిన సీమ చింతకాయలు ఇప్పుడు తక్కువగా దొరుకుతున్నాయి.

Manila Tamarind : ఒకప్పుడు మన గ్రామాల్లో ఎక్కువగా కనిపించిన సీమ చింతకాయలు ఇప్పుడు తక్కువగా దొరుకుతున్నాయి. ఈ చెట్లను ప్రత్యేకంగా ఎవరూ పెంచకపోవడంతో నేటి జనరేషన్‌కు ఈ పేరు కూడా తెలీకుండా పోయింది. అయితే ఒకవేళ మీకు దొరికితే మాత్రం మిస్ అవకుండా తినండి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కేవలం రుచికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Manila Tamarind benefits
బరువు తగ్గడానికి(Weight loss) ప్రయత్నిస్తున్న వారికి సీమ చింతకాయలు(Manila Tamarind 🙂 ఒక వరంలాంటివి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, డైటరీ ఫైబర్ (పీచు పదార్థం), మరియు సపోనిన్స్ బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా, ఇందులో ఉండే డైటరీ ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల సహజసిద్ధంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
డయాబెటిస్ (Diabetes) ఉన్నవారికి సీమ చింతకాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ డయాబెటిక్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కూడా ఇవి తోడ్పడతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇవి ఒక మంచి అదనపు ఆహారంగా ఉపయోగపడతాయి.
సీమ చింతకాయలు తినడం వల్ల కాలేయం (లివర్) పనితీరు మెరుగుపడుతుంది. ఇవి శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ (విష పదార్థాలు)ను తొలగించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
వీటిలో ఉండే ఒలియానోలిక్ యాసిడ్ పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.అలాగే చిగుళ్ల సమస్యలు, నోటిపూత నివారణకు కూడా సీమ చింతకాయలు ఉపయోగపడతాయి.
సీమ చింత కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మేలు చేసి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అరికడతాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ కాయల్లో పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండటం, కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్) తక్కువగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యకరమైన స్నాక్‌గా పనిచేస్తాయి.సీమ చింతకాయల గింజల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో కూడా వాడతారట.