Vitamin D: ఇలా చేస్తే పైసా ఖర్చు లేకుండానే కావాల్సినంత విటమిన్ డి
Vitamin D:ఒకప్పుడు ఉచితంగా, విరివిగా లభించే డి విటమిన్ కోసం ఇప్పుడు మందులు, సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Vitamin D
ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యలలో విటమిన్ డి లోపం ఒకటి. ఒకప్పుడు ఉచితంగా, విరివిగా లభించే ఈ విటమిన్ కోసం ఇప్పుడు మందులు, సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులు.
ముఖ్యంగా రోజంతా ఆఫీసులలో, ఇళ్లలో ఉండటం వల్ల సూర్యరశ్మికి దూరమవుతున్నాం. చాలామంది ఎండకు చర్మం నల్లగా మారుతుందని, లేదా పిగ్మెంటేషన్ పెరుగుతుందని భయపడి ఎండలోకి వెళ్లడం మానేస్తున్నారు. కానీ ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విటమిన్ డి (Vitamin D)పొందడానికి సరైన సమయం ఏది అంటే సూర్యరశ్మి నుంచి విటమిన్ డి (Vitamin D)పొందడానికి ఒక సరైన సమయం ఉందంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు.
వీరు చెప్పిన దాని ప్రకారం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య: ఈ సమయంలో ఎండలో నిలబడటం వల్ల మన చర్మానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుంది.
సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య.. మీకు ఉదయం వీలు కాకపోతే, సాయంత్రం కూడా ఇదే సమయంలో ఎండను తీసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండ ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి.

ఈ సమయాల్లో కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో నిలబడాలి. ముఖానికి ట్యాన్ లేదా పిగ్మెంటేషన్ సమస్యలు రాకుండా ఉండటానికి ఒక క్లాత్‌తో కప్పుకోవడం లేదా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం మంచిది. శరీరంపై ఎండ పడేలా కూర్చోవడం ద్వారా విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. శీతాకాలంలో అయితే పావుగంట కంటే ఎక్కువసేపు ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎండలోకి వెళ్లే ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.
విటమిన్ డి (Vitamin D)కోసం కేవలం సూర్యరశ్మిపైనే కాకుండా, ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.పాలు, పెరుగుని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.
సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డికి మంచి మూలాలు. మామూలు చేపల్లో కూడా ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.గుడ్లును కూడా రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.ఈ సూచనలు పాటించడం ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు, మీ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.