Fitness :సెలబ్రిటీల ఫిట్‌నెస్ రహస్యాలు..వారు రోజూ ఏం తింటారో తెలుసా?
Fitness :గ్రిల్డ్ చికెన్, చేపలు, గుడ్డులోని తెల్లసొన, పప్పులు, క్వినోవా వంటివి ఎక్కువగా తింటారు. అదేవిధంగా, వారు మంచి కార్బోహైడ్రేట్లను (Good Carbs) మాత్రమే తీసుకుంటారు.

Fitness
సినిమా తారలు, క్రీడాకారులు తమ ఆకర్షణీయమైన శరీరాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ప్రత్యేకమైన డైట్ ప్లాన్స్, వ్యాయామాలను పాటిస్తారు. సెలబ్రెటీల ఫిట్నెస్ రహస్యం కేవలం అదృష్టం కాదు, ఎంతో క్రమశిక్షణ, పట్టుదల. వారికి ఒక నిపుణుడైన న్యూట్రిషనిస్ట్, పర్సనల్ ట్రైనర్ ఉంటారు. వారు తమ తర్వాత పాత్ర, లేదా ప్రాజెక్టుకు తగ్గట్టుగా తమ రొటీన్‌ను మార్చుకుంటూ ఉంటారు.
సెలబ్రిటీల ఆహార నియమాలు చాలా కఠినంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. వారి డైట్‌లో లీన్ ప్రొటీన్ (Lean Protein) ప్రధాన భాగం. కండరాల నిర్మాణానికి, శరీరానికి శక్తిని అందించడానికి ఇది అవసరం. అందుకే వారు గ్రిల్డ్ చికెన్, చేపలు, గుడ్డులోని తెల్లసొన, పప్పులు, క్వినోవా వంటివి ఎక్కువగా తింటారు. అదేవిధంగా, వారు మంచి కార్బోహైడ్రేట్లను (Good Carbs) మాత్రమే తీసుకుంటారు.

బ్రౌన్ రైస్, ఓట్స్, చిలగడదుంపలు వంటివి శక్తిని అందిస్తాయి. కానీ, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలను పూర్తిగా మానేస్తారు. అలాగే, బాదం, వాల్‌నట్స్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరుకు, మొత్తం శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, తక్కువ మోతాదులో రోజుకు 5-6 సార్లు తినడం , వాటర్ తమ బాడీకీ ఎంత అవసరమో అంత వాటర్ తాగడం వంటివి పాటిస్తారు.
వారి వ్యాయామ నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. చాలామంది స్ట్రెంత్ ట్రైనింగ్ (Strength Training) చేస్తారు. బరువులు ఎత్తడం, ఫుల్ బాడీ వర్కౌట్లు చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. అదేవిధంగా, కార్డియో వ్యాయామాలు (Cardio Exercises) తప్పనిసరి. పరుగెత్తడం, సైక్లింగ్, స్విమ్మింగ్, లేదా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) చేయడం వల్ల స్టామినా పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

యోగా, పైలేట్స్ వంటివి శరీరానికి ఫ్లెక్సిబిలిటీని, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. వారు ఎంత బిజీగా ఉన్నా, తమ వర్కౌట్‌ను మిస్ అవ్వరు. ప్రతిరోజూ ఒక గంటకు పైగా కచ్చితంగా వ్యాయామం చేస్తారు. సెలబ్రిటీల ఫిట్‌నెస్ రహస్యం ఏదో మ్యాజిక్ కాదు. సరైన పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత విశ్రాంతి ఈ మూడే వారి విజయానికి మూలస్తంభాలు. ఇది కేవలం బాడీ బిల్డింగ్ కాదు, ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవడం.
One Comment