Bigg Boss Finale : బిగ్‌బాస్ ఫినాలేలో ‘మెగా’ రచ్చ..విన్నర్ అందుకునే ప్రైజ్ మనీ లెక్కలు తేలాయ్..
Bigg Boss Finale: ఈసారి స్పాన్సర్స్ నుంచి విన్నర్ కి ఒక ఖరీదైన ఎస్‌యూవీ కార్ , ప్రముఖ జ్యువెలరీ సంస్థ నుంచి 15 లక్షల విలువైన నెక్లెస్ లభిస్తాయి.
Bigg Boss Finale
తెలుగు రియాలిటీ షో చరిత్రలో బిగ్‌బాస్ సీజన్ 9(Bigg Boss Finale) ఒక సంచలనంగా నిలవబోతోంది. ఆదివారం డిసెంబర్ 21న జరగబోయే గ్రాండ్ ఫినాలేలో విన్నర్ కి వచ్చే బహుమతులపై ఇప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. ఈసారి కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, కళ్లు చెదిరే బహుమతులు కూడా విజేత కోసం సిద్ధంగా ఉన్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ , బహుమతుల విలువను మేకర్స్ భారీగా పెంచారు.
హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించిన ప్రకారం విన్నర్‌కు 50 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. అయితే ఈ 50 లక్షల మొత్తం విన్నర్ చేతికి నేరుగా రాదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194బి ప్రకారం, ఇలాంటి గేమ్ షోల బహుమతులపై 31.2 శాతం ట్యాక్స్ విధిస్తారు. అంటే 50 లక్షల్లో సుమారు 15.6 లక్షలు ప్రభుత్వానికి పన్ను రూపంలో వెళ్తాయి. అంటే విన్నర్ కి నికరంగా చేతికి వచ్చేది 34.4 లక్షలు మాత్రమే.
ఈసారి స్పాన్సర్స్ నుంచి విన్నర్ కి ఒక ఖరీదైన ఎస్‌యూవీ కార్ , ప్రముఖ జ్యువెలరీ సంస్థ నుంచి 15 లక్షల విలువైన నెక్లెస్ లభిస్తాయి. ఈ కారు విలువ సుమారు 18 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. విశేషమేమిటంటే, ఈ గిఫ్టుల విలువపై కూడా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ స్పాన్సర్ సంస్థలు ఆ ట్యాక్స్ భరించకపోతే, విజేతే స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.

టాప్-3 లో ఉన్నప్పుడు హోస్ట్ నాగార్జున ఒక నిర్ణీత మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. గతంలో సోహైల్ లాంటి వారు 25 లక్షల సూట్‌కేస్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇమ్మాన్యుయేల్ లేదా సంజన ఈ ఆఫర్ తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా సూట్‌కేస్ తీసుకుంటే, విన్నర్ కి వచ్చే 50 లక్షల నుంచి ఆ అమౌంట్ మైనస్ అవుతుంది.
తాజా లీకుల ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా రావడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు నిధి అగర్వాల్, శ్రీనిధి శెట్టి వంటి హీరోయిన్లు కూడా ఫినాలే స్టేజ్(Bigg Boss Finale) పై పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. కళ్యాణ్ పడాల ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో ఉన్నా.. తనూజ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ప్రభాస్ కూడా వీడియో కాల్ ద్వారా పలకరించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.



