HealthJust LifestyleLatest News

Night shift: నైట్ షిఫ్ట్ ఉద్యోగుల ఆరోగ్యం గల్లంతేనా? దీని కోసం ఏం చేయాలి ?

Night shift: రాత్రిపూట మేల్కొని ఉండటం వల్ల, మెదడు మెలటోనిన్ హార్మోన్‌ను సరిగ్గా విడుదల చేయలేదు.దీని ఫలితంగా నిద్రలేమి, నాణ్యత లేని నిద్ర వస్తుంది.

Night shift

రాత్రి షిఫ్ట్‌(Night shift)లలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొంటారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా సిర్కాడియన్ రిథమ్ డిజార్డర్ (శరీర సహజ గడియారం అస్తవ్యస్తం) దీర్ఘకాలిక ఆరోగ్య నష్టాలు ఎలా ఏర్పడతాయో, వాటిని అధిగమించే మార్గాలు ఏమిటో వివరిస్తున్నారు.

  • రాత్రిపూట కృత్రిమ కాంతిలో పనిచేయడం , పగటిపూట నిద్రపోవడం వల్ల శరీరంలోని సహజ జీవ గడియారం (Circadian Rhythm) దెబ్బతింటుంది. దీనివల్ల ఏర్పడే ప్రధాన ఆరోగ్య సమస్యలు..
  • రాత్రిపూట మేల్కొని ఉండటం వల్ల, మెదడు మెలటోనిన్ హార్మోన్‌ను సరిగ్గా విడుదల చేయలేదు. దీని ఫలితంగా నిద్రలేమి, నాణ్యత లేని నిద్ర వస్తుంది.
Night shift
Night shift
  • నిరంతర అలసట ,సరిగా నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ఇది తరచుగా అనారోగ్యాలకు దారితీస్తుంది.
  • ముఖ్యంగా రాత్రిపూట పనిచేసేవారిలో జ్ఞాపకశక్తి లోపం , ఏకాగ్రత లోపం సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
  • రాత్రి షిఫ్ట్‌(Night shift)లో పనిచేసేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి , సిర్కాడియన్ రిథమ్‌ను తిరిగి సెట్ చేసుకోవడానికి కొన్ని ‘బయోహ్యాకింగ్’ టెక్నిక్స్‌ను అనుసరించాలి.
  • రాత్రి షిఫ్ట్‌లో ఉన్నప్పుడు ఉద్దీపన కోసం ప్రకాశవంతమైన కాంతి (బ్లూ లైట్) ఉపయోగించడం.. షిఫ్ట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు కళ్లద్దాలు (Sun/Blue light blocking glasses) ధరించడం చేయాలి.
  • డాక్టర్ సలహా తీసుకుని సరైన సమయంలో మెలటోనిన్ సప్లిమెంట్‌ను ఉపయోగించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు.
  • షిఫ్ట్‌కు ముందు లేదా చిన్న విరామాలలో తక్కువ సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల శరీర శక్తి , చురుకుదనం పెరుగుతుంది.
  • సరైన జీవనశైలి మార్పులు మరియు స్లీప్ సైకిల్ నిర్వహణ ద్వారా, రాత్రి షిఫ్ట్‌లో పనిచేసేవారు కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలరు.

Narakasura: నరకాసుర వధ వెనుక ఉన్న లోతైన జీవనబోధ గురించి మీకు తెలుసా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button