Sore throat: గొంతు గరగర, కిచ్ కిచ్.. ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టేయండి..
Sore throat: గొంతులో ఇబ్బందిగా, గరగరగా అనిపిస్తోన్నా.. మాటిమాటికీ గొంతు సవరించుకోవాల్సి వస్తోన్నా.. లైట్ తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్లు

Sore throat
అసలే సీజన్ మారింది. వర్షాలు నాన్ స్టాప్‌గా కురుస్తున్నాయి. దీంతో ఆటోమేటిక్‌గా జ్వరం, దగ్గు వంటివి కామన్‌గా ఉంటాయి. అయితే ఇలా కాకుండా ఏ లక్షణాలు లేకుండా కేవలం గొంతులో ఇబ్బందిగా, గరగరగా అనిపిస్తోన్నా.. మాటిమాటికీ గొంతు(Sore throat) సవరించుకోవాల్సి వస్తోన్నా.. లైట్ తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్లు.
ఇది చిన్న సమస్యగా అనిపించినా, మన ఆరోగ్యంపై ఇది చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంని డాక్టర్లు చెబుతున్నారు. గొంతు(Sore throat)లో ఇలాంటి కిచ్ కిచ్ ఉన్నప్పుడు, ఏదో బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించిందని, దానితో మన రోగనిరోధక శక్తి పోరాడుతోందని అర్థం చేసుకోవాలని అంటున్నారు.
ఈ గరగరను నిర్లక్ష్యం చేస్తే, అది దగ్గుకు దారితీసి, కొన్నిసార్లు రెండు వారాలకు పైగా కొనసాగుతుంది. అంతేకాదు నెలల తరబడి ఉంటూ ప్రాణాంతకమైన క్షయకు కూడా దారితీయవచ్చు. అందుకే, మొదట్లోనే ఈ సమస్యకు చెక్ పెట్టడం చాలా ముఖ్యమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి నిరోధక శక్తి బలహీనపడినప్పుడు కఫం లేదా శ్లేష్మం ఏర్పడుతుంది. జలుబు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం లేదా పొగ వంటివి ఈ పరిస్థితికి కారణం కావచ్చు. అయితే, మెడిసిన్స్ కాకుండా, మన ఇంట్లో లభించే కొన్ని సహజమైన పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
Also Read: Children: వర్షాకాలంలో మీ పిల్లలకు చెప్పాల్సిన జాగ్రత్తలివే..
గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు వేసి, కాస్త నెయ్యి కలిపి తాగడం ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఇది గొంతులోని మంటను తగ్గించి, హాయిగా అనిపిస్తుంది. అలాగే, దాల్చినచెక్క పొడి, అల్లం పేస్ట్, టీపొడి కలిపి టీ తయారు చేసుకుని రోజుకు మూడుసార్లు తాగితే గొంతు గరగర తగ్గిపోతుంది. అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు(Sore throat)లో మంటను తగ్గిస్తాయి.
పుదీనా ఆకుల్ని నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ పుదీనా అందుబాటులో లేకపోతే, తులసి ఆకులతో ఇదే పద్ధతిని పాటించొచ్చు. చామంతి పువ్వుల రేకులను నీటిలో వేసి మరిగించి, కొద్దిగా తేనె కలుపుకుని తాగితే, ఇది బ్యాక్టీరియాను బయటకు పంపడంలో బాగా పనిచేస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తే, గొంతులో కిచ్ కిచ్ సమస్య నుంచి ఈజీగా రిలీఫ్ పొందొచ్చు.