Boxes : వంటగదిలోని డబ్బాలకు ఓ లెక్కుందట.. వాస్తు టిప్స్‌లో చూడండి..
Boxes : ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
Boxes
మనం ఉంటున్న ఇంట్లో వంటగదిని ఆ అన్నపూర్ణా దేవి నిలయంగానే అంతా భావిస్తాం. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది కేవలం ఆహారం వండుకునే చోటు మాత్రమే కాదని.. అది ఆ ఇంటి ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని నిర్ణయించే ప్రధాన కేంద్రం అని భావిస్తారు. మనం వంటగదిలో నిల్వ చేసే బియ్యం, ఉప్పు, పప్పులు ఏ దిశలో ఉన్నాయనే విషయాలతో పాటు వాటిని ఏ పాత్రల్లో ఉంచుతున్నామనే విషయాలు మన అదృష్టం మీద ప్రభావం చూపిస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
వంటగదిలో అత్యంత ముఖ్యమయినది ఉప్పు. వాస్తు ప్రకారం ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు. ఉప్పు డబ్బా( Boxes)ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. అందుకే సాల్ట్ పూర్తిగా ఖాళీ కాకముందే ఆ డబ్బాను నింపుతూ ఉండాలి. ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే ఉప్పును ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాల్లో( Boxes)పెట్టకూడదట. గాజు పాత్రల్లోనూ పింగాణీ జాడీల్లో మాత్రమే ఉప్పును ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి ప్రశాంతతనిస్తుంది.

చాలామంది అందం కోసం మెయింటెయిన్ చేయడం ఈజీగా ఉంటుందని ప్లాస్టిక్ డబ్బాల( Boxes)ను వాడుతుంటారు. కానీ వాస్తు , ఆరోగ్య రీత్యా ధాన్యాలను, బియ్యం వంటివి నిల్వ చేయడానికి స్టీల్, రాగి లేదా గాజు పాత్రలు వాడితే మంచిది. బియ్యం, గోధుమలు వంటి బరువైన ధాన్యాలను వంటగదిలో నైరుతి అంటే దక్షిణ-పశ్చిమ మూలలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయట. ఈ దిశలో బరువు ఉండటం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది.
అలాగే వంటగదిలో వాడే డబ్బాల మీద ఏమాత్రం దుమ్ము పట్టనివ్వకూడదు. మురికిగా ఉన్న పాత్రలు దారిద్య్రానికి సంకేతాలు అంటారు వాస్తు నిపుణులు. నిత్యం వాడుకునే పోపుల డబ్బా నుంచి బియ్యం బస్తాల వరకు అన్నీ శుభ్రంగా, పద్ధతిగా అమర్చుకోవాలి. రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకుని పడుకోవాలి.వంటగదిలోని ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.



