Just Lifestyle

milk : ఆవు పాలా? గేదె పాలా? మీ వయసుకి తగ్గ బెస్ట్ మిల్క్ ఛాయిస్ ఏది?

milk : చిన్న పిల్లలకు, వృద్ధులకు: ఈజీ డైజెషన్, బ్యాలెన్స్‌డ్ న్యూట్రియెంట్స్ కోసం ఆవు పాలు బెస్ట్.

milk : నీరసంగా ఉన్నా, హెల్దీగా ఉండాలనుకున్నా.. పెద్దవాళ్లు “పాలు తాగరా బాబూ!” అని చెప్పడం కామనే. డాక్టర్లు కూడా పాలను ‘పవర్ ప్యాక్డ్ ఫుడ్’ అంటారు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ లాంటి చాలా పోషకాలు పాలలో ఉంటాయి. ముఖ్యంగా, స్ట్రాంగ్ బోన్స్‌కి, ఓవరాల్ గ్రోత్‌కి కావాల్సిన కాల్షియం పాలలో పుష్కలంగా దొరుకుతుంది. అయితే, చాలామందికి వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే.. ఆవు పాలు బెటరా, గేదె పాలు బెటరా? ఈ రెండింటిలో ఏ పాలు ఎవరికి, ఎప్పుడు కరెక్టో ఇప్పుడు చూద్దాం.

Which is the best milk

ఆవు పాలను చాలామంది ‘లైట్ మిల్క్’ అని పిలుస్తారు. ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి, చిన్నపిల్లలకు, అలాగే ఏజ్‌డ్ పీపుల్‌కు బెస్ట్ ఆప్షన్. వీటిలో ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువే ఉన్నా, అది సింపుల్‌గా డైజెస్ట్ అయ్యేలా ఉంటుంది. ఆవు పాలలో ఫ్యాట్, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి.

సో, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్లు లేదా హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్లకు ఇవి మంచి ఛాయిస్. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా ఆవు పాలు హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ. స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకు కూడా ఇవి మంచివని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి.

గేదె పాలను నిజంగానే ‘పవర్ హౌస్’ అని చెప్పొచ్చు. ఇవి ఆవు పాల కంటే థిక్‌గా, క్రీమీగా ఉంటాయి. వీటిలో ఫ్యాట్, క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే హై ఎనర్జీ కావాల్సిన వాళ్లకు, ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్లకు లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్లకు ఇవి పర్ఫెక్ట్. గేదె పాలలో విటమిన్ A, B కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు బాగా లభిస్తాయి.

ముఖ్యంగా, మజిల్ గ్రోత్‌కి, స్ట్రాంగ్ బోన్స్‌కి కావాల్సిన న్యూట్రియెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. కొన్ని గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయని కొందరు నమ్ముతారు. అయితే, వీటిలో ప్రోటీన్ శాతం ఆవు పాల కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది, అది డైజెస్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైమ్ పడుతుంది.

చిన్న పిల్లలకు, వృద్ధులకు: ఈజీ డైజెషన్, బ్యాలెన్స్‌డ్ న్యూట్రియెంట్స్ కోసం ఆవు పాలు బెస్ట్. కానీ, ఏడాదిలోపు పిల్లలకు మదర్ మిల్క్ లేదా ఫార్ములా మిల్కే ఫస్ట్ ప్రయారిటీ అన్న విషయం మర్చిపోకూడదు..

గ్రోయింగ్ కిడ్స్, టీనేజర్స్, యంగ్‌స్టర్స్.. ఓవరాల్ డెవలప్‌మెంట్, ఎనర్జీ కోసం రెండు రకాల పాలు తీసుకోవచ్చు.

వెయిట్ లాస్ అవ్వాలనుకునేవాళ్లు / హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు.. తక్కువ ఫ్యాట్, తక్కువ క్యాలరీస్ ఉండే ఆవు పాలు మంచి ఛాయిస్.

అథ్లెట్స్, జిమ్ చేసేవాళ్లు, హెవీ ఫిజికల్ వర్క్ చేసేవాళ్లు.. ఎక్కువ ఎనర్జీ, ఫ్యాట్, పోషకాలు అవసరమైతే గేదె పాలు మరింత బెనిఫిషియల్.

నార్మల్ అడల్ట్స్..రెండు పాలు హెల్దీవే. మీ బాడీకి ఏది సెట్ అవుతుంది, డైజెషన్ ఎలా ఉంది అని చూసి డిసైడ్ అవ్వొచ్చు.

ఫైనల్‌గా చెప్పాలంటే, ఆవు పాలు, గేదె పాలు రెండూ వాటి ప్రత్యేకతలతో ఆరోగ్యానికి మంచివే. మీ బాడీ నీడ్స్, ఏజ్, డైజెస్టివ్ సిస్టం బట్టి ఏ పాలు సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూడాలి. ఏమైనా డౌట్స్ ఉంటే, న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం బెటర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button