Pulses: పప్పులు ఇలా తింటేనే సంపూర్ణ ఆరోగ్యమట..
Pulses:పప్పులలో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే, వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్లనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి

Pulses
పప్పులు(Pulses), కాయధాన్యాలు మన రోజువారీ ఆహారంలో అత్యంత ముఖ్యమైనవి. మన దేశంలో దాదాపు 65 వేల రకాల పప్పులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే, వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్లనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. పప్పుల నుంచి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి కొన్ని కీలకమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది పప్పులను నేరుగా వండుకోవడం, లేదా వంటల్లో ఉపయోగించడం చేస్తుంటారు. కానీ వాటిని నానబెట్టి, మొలకలు వచ్చాక( (Sprouting)) తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పప్పుల్లో “యాంటీ న్యూట్రియంట్లు” అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరం పోషకాలను గ్రహించకుండా అడ్డుపడతాయి. అయితే, పప్పులను నానబెట్టి, మొలకలు వచ్చినప్పుడు ఈ యాంటీ న్యూట్రియంట్లు విచ్ఛిన్నం అవుతాయి. ఫలితంగా, శరీరానికి సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్ వంటివి సులభంగా అందుతాయి. ఇది అరుగుదలను మెరుగుపరచి, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
పప్పుల(Pulses)ను సాధారణంగా బియ్యంతో కలిపి తింటుంటాం. అయితే, బియ్యానికి బదులుగా చిరుధాన్యాలు (మిల్లెట్స్), ఇతర కాయధాన్యాలతో కలిపి తీసుకోవడం చాలా మంచిది. పప్పుల్లోని అమైనో ఆమ్లాలు, చిరుధాన్యాల్లోని అమైనో ఆమ్లాలు కలిసినప్పుడు పోషకాల గ్రహణ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ కాంబినేషన్ వల్ల ఎముకలు దృఢంగా మారతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా కూడా సహాయపడుతుంది.

పప్పుల(Pulses)తో ఇతర ప్రయోజనాలు..పప్పుల్లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వీటిలో ఉండే ఫైబర్ మరియు ప్రొటీన్లు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది.అలాగేగ పప్పులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అందుకే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
One Comment