fitness : 40 ప్లస్.. ఫిట్‌నెస్ ఫార్ములాలో ఈ తప్పులు చేయొద్దు..!
fitness :అతిగా వ్యాయామం వద్దు, అతిగా విశ్రాంతి వద్దు. "రోజులో గంటలు గంటలు కష్టపడాలి" అనుకోవడం 40 దాటిన వారికి మంచిది కాదు.

fitness: మనిషి వయసు పెరిగే కొద్దీ శరీరం సహజంగానే మారుతుంది. 40 ఏళ్లు దాటిన(40 Plus) తర్వాత కండరాల బలం తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, చిన్న గాయాల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం మామూలే. అందుకే ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాయామం, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు చాలా ముఖ్యం. వాకింగ్, యోగా, తేలికపాటి వ్యాయామాలను డైలీ రొటీన్‌లో భాగం చేసుకోవాలి.
fitness
చాలామంది ఫిట్‌నెస్(fitness) పేరుతో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. 40 ప్లస్ వాళ్లు వ్యాయామం చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులను తెలుసుకోవాలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు
అతిగా వ్యాయామం వద్దు, అతిగా విశ్రాంతి వద్దు. “రోజులో గంటలు గంటలు కష్టపడాలి” అనుకోవడం 40 దాటిన వారికి మంచిది కాదు. శరీరం త్వరగా కోలుకోలేదు కాబట్టి, అతిగా వ్యాయామం చేస్తే గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. వారానికి 3 నుంచి 4 రోజులు, ప్రతిరోజు 40 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేస్తే సరిపోతుంది. వ్యాయామానికి ముందు వార్మప్, తర్వాత కూల్‌డౌన్ తప్పనిసరి. ఇవి కండరాలను రిలాక్స్ చేసి, గాయాలు కాకుండా చూస్తాయి.
నీళ్లు తాగడం మర్చిపోవద్దు. డీహైడ్రేషన్ డేంజర్! వ్యాయామం చేసేటప్పుడు చెమట బాగా పడుతుంది. సరైనంత నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే వ్యాయామానికి ముందు, మధ్యలో, ఆ తర్వాత పుష్కలంగా నీళ్లు తాగడం ముఖ్యం. మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
కీళ్లపై ఒత్తిడి తగ్గించండి. ఈ వయసులో కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవడం ముఖ్యం. రన్నింగ్, జంపింగ్ వంటి హై-ఇంపాక్ట్ వ్యాయామాలకు బదులుగా స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, వాకింగ్ వంటి లో-ఇంపాక్ట్ ఎక్సర్‌సైజులు ఉత్తమం. వేగంగా చేసే వాటికి బదులు, నెమ్మదిగా, నియంత్రిత కదలికలతో చేసే వ్యాయామాలను ఎంచుకోవడం చాలా మంచిది.
భోజనం తర్వాత గ్యాప్ మస్ట్. తిన్న వెంటనే వ్యాయామం చేయడం జీర్ణక్రియకు మంచిది కాదు. కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాతే వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడదు, వ్యాయామం కూడా సమర్థవంతంగా ఉంటుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, 40 ఏళ్లు దాటిన వారు కూడా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఉండొచ్చు. మీ శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడానికి, ఫిట్‌నెస్ నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.